భక్తకల్పద్రుమ శతకము
(అష్టాదశ వర్ష ప్రాయంలోని తొలి రచన)
(తొలి ముద్రణ : 1949)
సంతోషము
ఈ నుకవి నా యోద్దకీ శతకమును దిద్దించుకొనే
తాత్పర్యముతో తెచ్చియున్నాడు.
ఈ రచనలో బహుసాహితీద్రష్టం– స్రష్టం కూర్పు,
నేర్పు ఇమిడి యుండడంవల్ల చదివేటపుడు కల్గిన ఆనందంలో నేను తన్మయుణ్ణి కావడం వల్ల,
నిజానికి దోషాలు లెఖ్క పెట్టనవసరం లేనివి. స్వల్పంగా ఉన్నా లేనట్టుగానే
కనిపించాయి.
కాళహస్తీశ్వరలోని ధూర్జటి కవిత్వంలో ఉండే
యావత్తుగుణాలు ఈ తనిలో మూర్తీభవించాయనిన్నీ, నన్నయ్యలోని సమాసం పొదిగిoపున్ను పుoజీభవించిoదనిన్నీ,
సంతుష్టిపూర్వకంగా నేను నిర్వచనం చేస్తున్నాను – పై హెడ్డింగు వల్లనే వ్రాత – కవి
కోరకుండానే. నేను వ్రాసి ఇచ్చానని పాఠకలోకం
గ్రహిస్తుంది – కనుక మహమ్మద్ హుస్సేన్ కవిని ఇతోధికాభివృద్ది కలవానిగా దీవించుతూ భగవతికాత్యానికి శిఫారసు
చేస్తున్నాను.
3-3-1945
Kadiyam, విద్వాన్
చెళ్ళపిళ్ళ దుర్గేశ్వర శాస్త్రి, శతావధాని
స్మరణ
జననీ! సాత్విక భావభూషణ ఘృణీ! సాజన్య సౌదామనీ
పెనుక్షామమ్ములు, గాంచి – పెక్కిడు మలన్
వీక్షించి – సైరించి – నీ
చనుబాల్ సత్త్వ మొసంగి సాకితివి – నా సాహిత్యవైదగ్ధ్య సం
జనకం బెన్నోకృతుల్ వెలార్చితి – కృతజ్ఞత్వంబు
చెల్లించెదన్
ననుముద్దారగ – నగ్ర పుత్రుడని – విన్నాణం బునన్
బెంచి - పె
ద్దను గావించి – సుభాశిషంబులిడి - విద్యా బుద్ధులన్ నేర్వజే
సిన మాయమ్మ “హుసేను బీబి “ – ఋణమున్
జెల్లింతునేనెట్లు ? చం
ద్రున కర్పించెడు నూలు పోగనగ గూర్తున్ – నా
నమోవాకముల్.
జనకా! దేశికవృత్తియందు - నిను మించంజాలు,
వారెవ్వరున్
గనరా “రన్నయశమ్ము గాంచితివి, రంగ గద్వైద్య రంగమ్మునన్
జను “లోహో“ యనుకీర్తి గొంటివి ‘సిలార్ సాహెబ్ ‘ –
ప్రసిద్ధాహ్వయ
మ్మున వేనోళ్ళ పొగడ్త లందితివి - కైమోడ్పుల్ -
గ్రహింపంగదే !
కుమారుడు
దొరసానిపాడు మహమ్మద్
హుస్సేన్
1.
శ్రీమత్పావన భక్త చిత్తనిలయా! శ్రేయః ప్రదా!
అవ్యయా!
సోమాబ్జప్రియ
తారక గ్రహసృజా! శుంభన్ని రాకారవ
ర్తీ!
మాయాసవిలాసకల్పిత జగచ్చ్రేణీ! కృపాంభోనిధీ!
నీ
మాహాత్మ్యమెఱుoగ మాతరమే? తండ్రీ! భక్తకల్పద్రుమా!
2.
పలుకైనన్ వచియింప జాలని కడున్ బ్రజ్నా విహీనుండ,
ధీ
లలిత
జ్యోత్స్న యొకింత నా కొసంగి పల్కం
జేయుచున్నావు, వ
త్సలతా
పూర్ణుడవై, కడింది నెరసుల్ ,తండ్రీ!ననుందా కినన్
గల నా
భారము నీ పయిన్ విడిచితిన్ సద్భక్త కల్పద్రుమా
౩. భారంబెల్ల
భవత్కృపాలవము పై భావించితిన్ గాన న
న్నేరీతింగరుణిoచిమన్పెదొ?
కృపాబ్ధీ! మేధ్యదుగ్ధోల్ల స
త్పారావారా
తరంగసంచయ సదృగ్ధారాళవాగ్ధాటి నీ
వే;
రమ్యప్రతిభా విభుల్ పొగడ, దండ్రీ భక్తకల్పద్రుమా!
4.
అవనిన్ లోకులమెప్పు గాంచుటకై యత్నింప గానొల్ల సౌ
ఖ్యవశీభూత
మోనోవిహారతను నేనాశిoపగానొల్ల బూ
ర్వవిరుద్ధాన్వయ
ధర్మబంధములకే బధ్దుండ గా నొల్ల, భ
క్తవిభాసీ!
నినుమర్వనొల్ల, సకలంకా! భక్తకల్పద్రుమా!
5.
నీకారుణ్య సుధారసంబొలికినన్ నే భక్తిబీజంబు హృ
త్ప్రాకట్యస్థలినున్చి
సాకెద, రసప్రౌఢిన్ దదంకూరమే
మోకై
మ్రానయి వృక్షమై తలిరులుం, బూల్, కాయలుం, బండులై
మాకోర్కుల్
ఫలియింప వేగఁ; బరమాత్మా! భక్తకల్పద్రుమా!
6.
ఎన్నో సత్కృతుoడవీడి, దురితాహీన ప్రయత్నుండ నై
నిన్నుoగానక
మోసపోతి, మదమే నిత్యంబటoచెంచి త
న్నన్నా!
దీనుడనైతి గుర్తెరి గి: పాపానీకముల్ బాయ, వా
పన్నుండం
గృపతోడనన్గనుమ, దేవా! భక్తకల్పద్రుమా!
7.
నరకంబంచువచించు పల్కువినినంతన్ గుండె నీరౌను, హృ
త్సరసీజంబువికారమందు,
వెఱచేతన్ బొందికంపించు, స
త్కరుణాపాoపతి,
నోటమాటనుడువంగా శక్తియుంజాల, దె
క్కరణిన్
గాoతువో? నన్ను: నీ కృప యఘఘ్నా! భక్త కల్పద్రుమా!
8.
నేనే చేసితి బెక్కు సత్కృతులు; నేనే మూలమీసే
తకున్
నేనే
యీ ప్రజ గాచుచుంటి ననుచున్ హీనాత్ము డుప్పొంగ నౌ
నే?
నిక్కంబు; నిమిత్తమాత్రుడు గదా! యిద్దాత్రిలో మర్త్యు డీ
వే;
నిత్యుండవు మూలకర్తవును దండ్రీ! భక్త కల్ప ద్రుమా!
9.
తనకుం గల్గిన యాస్థులం గపటయత్న ధ్యానహృత్కంజులై
యనయంబుందఱి జూచుచుందురు, గొనన్ సౌన్నత్య మీక్షించలే
రె నయం జోరులదాయలంబలె మహాహృత్కoటకుల్ భ్రాత: లీ
యనుజుల్,
వారలభ్రాoతియేల? నకలంకా! భక్త కల్పద్రుమా!
10.
బలవంతుల్ బలహీనులం దృణముగా భావించి బాధింతురీ
విలసద్ధర్మముబోధకా:
దరయ నీవే సృష్టియందిట్టి నే
ర్పుల
గల్పించితొ? ప్రాణి సైజమొ? మరేమో? యoదునేమున్నదో?
కలగున్
గుండెలు చూచినంత: నకలంకా! భక్తకల్పద్రుమా!
11.
ధనమార్జించెడులాలసుండును, బృహద్రాజ్యాధికారంబులన్
గొననూహించెడువాడు
వైభవములన్ బొందంగయోజించు వా,
డనయంబున్
దురితవ్రజాత్ముడయి మాయామోహపాశావృతుం
డన
గానొప్పు నినుoదలంప డెపుడాద్యా! భక్తకల్పద్రుమా!
12.
మనమందెంచెడు ఫక్కివేఱు పయిగామాటాడు తీర్వేరు, చే
యున
దూహింప గ నింకొకండు కలిమాయో! యిద్ది యింకేదియో
ఘనధర్మంబులు,
భక్తి పావనతయున్ గారుణ్యముల్ మర్త్యులం
దు నశిoచెంగడుమీఱె
హిoశలిలయందున్ భక్తకల్పద్రుమా!
13.
కలలో బెన్నిధి గాంచు పేదవలె, వేగంబొప్పగా నెండ మా
వులకుం,
బర్విడు జంతువుoబలె స్వయంభూ! కాననంబందు మా
ర్గలసద్వ్యక్తముగాని
పాంధుగతి: మర్త్యవ్రాత మశ్రాంత ని
స్తుల
సంసార విపత్పరంపరల గుందున్, భక్తకల్పద్రుమా!
14.
సైరింపంగలనా? వ్యధోత్కరము నీశా! నన్ను బాలిoపుమా
ధీరత్వంబునశిoచె,
సుంతయు మనస్తేజంబులేదయ్యె నా
సారాచారములున్
లయించె బలవచ్ఛoకాప్తి మెండయ్యె గీ
కారణ్యoబు
విధంబు తోచు జగ, మన్నా! భాకల్పద్రుమా!
15.
పవనుoడెట్టు లదృశ్యరూపుడయి విశ్వoబందువ్యాపించి
ప్రా
ణి విశేషoబుల
గాచుచుండు, నటులే నీవున్ నిరాకార మూ
ర్తివి,
నిత్యుండవు, సుప్రభావు డవు, ధాత్రీనాథ, నాధుoడ, వె
ల్ల
విలానంఋల కీవె, ముఖ్యుడవు, నౌరా! భక్తకల్పద్రుమా!
16.
తనకున్ రెండు గజాలమేర యయినన్ ధాత్రీతలంబందు జా
లును
గుప్తంబొనరింప నిమ్మెయిని గోర్కుల్ లోన బెంపొందుచుం
డ,
నరుoడక్కట! వేలమైళ్ళపుడమిం దానేలుచుం దృప్తినిo
గనజాలం
డదియేమి వింతయో? యఘఘ్నా! భక్త కల్పద్రుమా!
17.
నిన్నున్ నమ్మిన వారికెన్నడును లేనేలేదు కష్టంబటం
చెన్నేరీతుల
బెద్దలాడెదరు, సామీ! నాదుకర్మంబులా
పన్నుoజేసె,
మఱేది దిక్కు? కృపతో బాలించి రక్షిoపుమీ,
నన్నీ
పట్టున; నిన్దలంతు నెపుడున్ సద్భక్త కల్పద్రుమా!
18.
పాపంబందురు కొందఱా కృతినె యుత్పాదించు పుణ్యంబు
నా
నే
పారన్ వచియింత్రు కొందఱెదియో, యిందున్ నిజంబారయం
బాపంబో,
ఘన పుణ్యమో! యొఱుగ నీభక్తిన్ హృదబ్జoబునన్
దీపంపంబొనరింతు
గావు మనురక్తిన్, భక్తకల్పద్రుమా!
19.
కాయల్ గాచె భవత్కృపాప్రభలకై కాంక్షించు
మన్నేత్రముల్
ఓయన్నా!
యని వేడి వేడి విసువెంతో చెందె నావాయి, క
ట్టా!
యస్మత్పరితాప జీవితము రవ్వంతేనియున్ సార్ధకం
బై
యొప్పార ననుగ్రహిoపవొకొ? దేవా! భక్తకల్పద్రుమా!
20.
ఒక జీవిన్ మఱియొక్క జీవికి బ్రియంబొప్పంగ నన్నంబుజే
సి,
కడున్ జీవన మార్గమేర్పరచితే, శ్రీ సృష్టియందే, మహా
ఘకలోద్య
ద్రచనంబులున్కి నరయంగా జాల దోషంబు, నే
రకయో;
నేర్చియు! హిoసలం జలుపుపట్లన్, భక్త కల్పద్రుమా!
21.
నరహంతల్, గుణహీను: లన్యతరుణీ నానావిధాశ్లేషల
బ్ధరతుల్,
స్వార్ధపరుల్, కృపారహితు, లార్ద్రక్రోధలోభాత్ము, లీ
ధరణీనాధులు:
వారి పాదములకున్, “దాసోహ హీనోక్తి” సం
కరసేవల్
పచరిoపనేల? దురితఘ్నా! భక్తకల్పద్రుమా!
22.
ఈ దౌర్మార్గ్య మదాంధకారయుత భూభృత్కోటి
సృస్టించితే
లా!
దుష్టాళిని గూల్పజేయువిధికో! లాస్యాoగనా భోగ స
మ్మోదంబిచ్చుటకో?
యనాధనిచయంబుoబట్టి, తద్రక్తమాo
సాదుల్
పీల్పగ జేసి నవ్వుటకొ? దేవా! భక్తకల్పద్రుమా!
23.
కడు బాటంచును గాక, చెమ్మటలవా కల్ నాక దుష్కార్యమం
చుడుగంబోక,
తలoపకెoడయని, మర్త్యుండర్ద రూప్యంబుకై
యిడుమల్
పెక్కు సహించు గాని ప్రియతన్ సృ ష్టించి తన్నెల్లయ
ప్పడుమన్నిoచుచు
సా కునిన్దల ప డెప్డున్ భక్తకల్పద్రుమా!
24.
నన్నుంగావగవేడుచున్నాను గటా! నాపై
గృపం జూపవై
తన్నా!
క్రుద్ధుడవైతివో! కనవో! నాయత్యంతదీనత్వమున్
మన్నింపదగదో
తలంపవో! సకర్మంబో!
విలాసంబో! నే
నేన్నేరీతుల
సంస్తుతింతునిను దండ్రీ భక్తకల్పద్రుమా!
25.
అజ్ఞానంబున బెక్కుదుష్కృతుల నన్నా! చేసితిన్
మామకా
వజ్ఞల్
సైచుమి, సివదిక్కుసుమి, యాపద్బాంధవా, యుష్మదీ
యాజ్ఞన్ మీరితి బామరత్వమున గర్వాంధుండవై, యియ్యెడన్
విజ్ఞానంబిసుమంతకకట్గే
గతినీవే! భక్తకల్పద్రుమా!
26.
దయయున్ ధర్మము, శౌచశీలమును, నిత్యంబైన, సత్యంబు,
భ
క్తియు,
సత్కార్యనితాంతలాలనతయున్ దీపంప డెందబునన్
క్షయ
భీతిన్ మఱపందకెవ్వడు, దగన్ వర్తించు? మర్త్యోద్భవుం
డయి
రాజిల్లు కృతార్ధుడాతడు ముకుందా! భక్తకల్పద్రుమా!
27.
రాజ్యాశాలతికాని బద్ధులయి, హోరా హోరిగా బోరి, సా
మ్రాజ్యాధీశపదంబులంద,
జనసద్రక్త ప్రవాహోత్క
బీ
జ్యా సంస్థలి బారజేసి నృపులై యేతెంచినారెంద? ఱా
ప్రాజ్యుల్నే
డొకరైన నుండి రొకొ? దేవా! భాక్తకల్పద్రుమా!
28.
భళిరా! ఎన్ని సువీరశోణిత ధునీవ్రాతంబులన్
గ్రోలేనో?
బలిగా
నెందరి జీవజాలములు కప్పంబట్లు తా మ్రింగెనోక్ష!
యిల;
పైశాచికమౌ పిపాసయు బలెన్, దృప్తింగనం జాలెనే?
ఫలమా!
పంకము దీని గోరునెడ, దేవా! భక్త కల్పద్రుమా!
29.
మధుమాసంబోగి భూరుహచ్ఛదములన్ మానొప్ప గల్గింప ద
ద్విధ
భగ్నంబొనరించు ఫాల్గుణము: ధాత్రిన్ జీవసందోహమున్
విధి
నిర్మింపగ, మృత్యుదేవి, భమదోద్వేలాత్మయై మ్రింగు: దు
ర్విధముల్
గా? మరణోద్భవoబులు: కృపాబ్ధీ!
భక్తకల్పద్రుమా!
30.
సలిలంబానెడుపట్లనో! మెతుకులాసన్ మ్రింగుచున్నట్టి
వే
ళలనో!
రాజితయానమందొ! వచనోల్లాసంబునందో! సుషు
ప్తిల
సన్మోదమునందొ? కాక మఱియే దివ్యానుభావంబులం
దొ!
లయంబేతిరమౌను ప్రాణికి; సుబంధూ! భక్తకల్పద్రుమా!
31.
సుగుణoబుల్ గల మానవుండు ఘనుడై శోభిల్లు బుష్పంబు
తా
విoగదా!
పేర్గను; సద్గుణుoడును, ల సత్ప్రీతిన్ భవద్భక్తి చే
దగ బూజ్యుoడగు,
సూన. మబ్జదళ దృగ్ధమ్మిల్లమందొప్పి న
ట్లుగ,
గానన్, నిను సంస్మరిoచెద, గృపాళూ! భక్తకల్పద్రుమా!
32.
నరుతోఛాయయు బాయకుండునటులం, గాలుండు, వెన్నాడెడిన్
నిరతిం,
బ్రాణి చయంబు: నెట్టి తఱినో! నిశ్శoకలంఘించి, భీ
కర
దర్వీకరరాజు, దర్ధురము. వీ కం బట్టు చందాన, ని
ష్కరుణాత్ముoడయి
కొoచునే గు దురితఘ్నా! భక్తకల్పద్రుమా!
33.
ఫలసంభార మహీరుహాళి బలవాత్పాషాణ సంఘాత ని
స్తుల
కష్టంబుల నందునట్లు, సుజనుల్ దుష్టాళిచే బెక్కు బా
ములకున్
లోనయి, ధైర్యనైజసుగుణoబుల్ చాటుచుం, గార్యస
త్ఫల
భాగ్యోదయధన్యులౌదురు ముకుందా! భక్తకల్పద్రుమా!
34.
పరనారీ పరిరంభ గుంభన సుఖవ్యాపార పారీణతల్
పరమాహ్లాదకరంబుగా,
నతుల హేలాకృత్యనీకంబుగా
బరిభాషింతురు,
జారదుర్గుణులు, దేవా! దానసంప్రాప్తమౌ
ధరణీనారక
వేదనల్ తెలియరాద్యా! భక్తకల్పద్రుమా!
35.
అతిచాంచల్యమనోరసంబు, నిలుపన్, హా! పట్ట, సాధ్యంబె,
సం
తతమున్
మర్కట చేష్టలం బలె, వృధా ధ్యానంబు గల్పించి, యా
తత ఘోరాఘములంబొనర్ప
దలపుల్ దట్టించు నోదేవ! యే
గతి
రక్షీoతువో? గృపాకలనవేగన్ భక్తకల్పద్రుమా!
36.
అరయన్ ధారుణి “రాజుకన్నను ఘనుండౌ మొండియే“ యన్నయ
క్కరణిన్,
మూర్ఖులు, దొర్బలాఢ్యలు, చెలంగంబాప! మశ్రాంత ధ
ర్మరతుల్
దుర్బలు లేమిచేయగలరో? రవ్వంతయోజించుమా
కరుణాబ్దీ!
విని మాదు మొఱ్ఱలను సా కన్: భక్తకల్పద్రుమా!
37.
ధరయందెంతటి బుద్ధిమంతుడయినం, దా జల్పుకార్యంబు,
చం
దురునిం
బోలి కళంకయుక్తమగుటం, దోషంబులేనట్టి రె
వ్వరు?
సర్వజ్ఞులె? మానవుల్, క్షణములో బ్రత్యక్షమౌ కష్ట సౌ
ఖ్యరమన్
నేరరు: మూర్ఖవర్తను, లాఘఘ్నా! భక్త కల్పద్రుమా!
38.
ఏకార్యం బొనరింపనే గినను, నందే మృత్యువుండున్
విభూ!
ఏకార్యం
బొనరింపకుండినను ముందే మృత్యు వే త్రోవయౌ
మాకున్
వెన్క నునూయి ముందు గొయియన్ మాటల నిజం బయ్యె బ్రా
పైకావంగదె!
మమ్ము నెల్లపుడు దేవా! భక్త కల్పద్రుమా!
39.
నీ కారుణ్య శరత్సుధాకర సుధానిర్హేతుకజ్యోత్శ్నలే
కా
కీసంసరణాoధకారమున మార్గంబున్ నిరూపింప, వే
ఱే
కాంతుల్ గలవే? యనాతరము, నిన్నే కొల్వ విజ్ఞానమున్
మాకిమ్మా!
మముసా కుమా! యమృతధామా! భక్త కల్పద్రుమా!
40.
దేవుండేకృప మాలెనంచు గరమార్తిన్ మొఱ్ఱలంబెట్టుటల్
మావిజ్ఞానవిహీనతoజుమి!
మహాత్మా! నీవు పేక్షీoచుచో
నీవిశ్వoబుననొక్క
జీవి సయితం బిoపార జీవించునే?
మావాగ్దోషము
సై చి జ్ఞానసుధ నిమ్మా! భక్త కల్పద్రుమా!
41.
అయయో మేముకడున్ జడాత్ములము, మాయవ్యాజకర్తవ్య మెం
తయో ధాత్రింగల
దీయపారభవ సంత్రాసాతి వేలాబ్దినె
మ్మోయి
నుత్తీర్ణుల మౌట! యెoచినభయంబేకల్గు ద్వత్పావనా
హ్వయనౌకన్
సమకూర్చి బ్రోవుము మహాత్మా! భక్త కల్పద్రుమా!
42.
ఎన్నండైన నధర్మ మార్గమున నేమే గంగ నూహిoచుచో
నన్నా!
మాకదిలెస్స గాదనుచు నీవాపట్టునన్ బోధ సే
యన్నిర్మిoతువు
శిక్షనొం, డవుర! శిక్షాపాదనంబందునై
నన్నిండారెడు
ప్రేమబాయవు, ముకుందా: దురితఘ్నా! భక్త కల్పద్రుమా!
43.
హే! నిర్వ్యాజపరోపకారహృదయా! హే దీనసంరక్షకా!
హేనిత్యామితముత్ప్రదర్శకవిభూ!
హేసుప్రభావాంబుధీ!
హేని:
ఖేదమన: ప్రచారలసితా! హేసర్వసువ్యాపకా!
హేనిర్వాణ
సుఖప్రదా! నిరుపమా! హేభక్త కల్పద్రుమా!
44.
సతతో దంచిత నిర్నివార్య సుఖవాంఛాతత్పర్వు మానవు ల్
వెత
రవ్వంత భరింపజాల, రకటా! క్లేశoబులే లేనిచో
క్షితిలో
నిన్ను స్మరించు ప్రాణికలాదే! శ్రేయోవ్యధల్ సర్వమున్
మతి
గుర్తించియెమాకు గూర్తువు మహాత్మా! భక్త కల్పద్రుమా!
45.
తనయిల్లాలిపయిన్ సమాదరణయున్, దాసోత్కరంబందు, న
త్యనుకంపాహృదయంబు,
సర్వజనులం దశ్రాoతమున్ గౌరవం
బును,
ధర్మానుసర ప్రవర్తనయు, నంపూతాత్మ నీభక్తి, స
ల్పని,
యమ్మానవు జన్మమెందులకు? దేవా! భక్త కల్పద్రుమా!
46.
అతులా మోదసుఖంబులెంతలరినన్ హా! మానవుoడేరీ తో
డుత దా
దెల్పెడు లోభరిoచును పటాటోపంబుగానల్ప దు
ర్గతియే
కల్గిన జాటు బల్వురకు నీ కంగ్రుంగి రోదిoచున
శృతతాంభ:
కణముల్ స్రవింప రొదసల్పున్ భక్త కల్పద్రుమా!
47.
కట్టంగుడ్డయు మెక్క దిండియును గల్గంజాలు సుశ్రీని
జే
పట్టం జాలిన
భంగి క్షాంతి గుణ సంపన్నత్వమే కల్గు చో
నిట్టె
వైభవమందినట్లు సిరులున్ హేలావిలాసంబు లే
పట్టున్హాహానియ
సేయుమా కరయ దేవా! భక్త కల్పద్రుమా!
48.
ధర్మాధర్మావిచక్షణత్మక విభూ! దాక్షిణ్యపూర్ణాoబుధీ!
ధర్మాత్మోత్కర
రక్షకా! విమలభక్తశ్రేణిహృన్నర్తకా
కర్మోద్ఘోషితభూరుహక్రకచకా!
కాలోకకాలాoతకా!
నిర్ముక్తాయత
సంసృతీ హృదయ! తండ్రీ! భక్త కల్పద్రుమా!
49.
పగలెల్లం, గడుజాగరూకతమముం బాలిoచినావీశ్వరా!
తగ
నేత్రంబుకు రెప్పవోలె నికబ్రాప్తంబయ్యె రేవేళ యే
సుగతింగాతువో!
మమ్మునిత్త ఱిని మైసుoతేని వాటిల్లు మి
శ్రగతిన్
నేరదు: సచ్ఛవంబు నిదురన్ సద్భక్త కల్పద్రుమా!
50.
కులభేదంబులు లోకమందునటనా కూతంబు లాచారముల్
నెలయంగా
దాగు సౌఖ్యదంబులు పృధగ్వేషంబులుం దుష్టిసం
కలితంబుల్
పరికింప గేవలము త్వత్కాoక్షల్ లసన్ముక్తిదో
త్కలికాప్రాప్తికి
మానవ ప్రతతికౌగా! భక్త కల్పద్రుమా!
51.
ఏనాడో నశియిoచుదేహమనుచున్ హీనాత్ముడుంబల్కు గా
నీ!
నిత్యాచల మోక్షలబ్దకృతులన్ జేయంగనూహింప డ
త్యానందాత్మకమంచు
సంసరణకృత్యక్లేశబంధత్వమెం
తైనన్ సైచును తుచ్ఛభోగరతి: దేవా! భక్త కల్పద్రుమా!
52.
వెలయన్ రుచ్యపదార్ధమంచు బిశితాపేక్షన్ నరుల్
కొన్ని జీ
వుల
హింసించిభుజింప మత్కుణములన్ బుట్టించి తన్మానవో
జ్జ్వల
రక్తాశనమొప్ప బెట్టితివి సూక్ష్మప్రాణిచే మానవుం
గలగంజేతువు
బాపురే! నిఖిల దక్షా! భక్త కల్పద్రుమా!
53.
పాపాభీల విషాగ్ని సంభరిత విశ్వoబందు నశ్రాoతమున్
దాపగ్రస్తమన:కుశేశయ
తనూదందహ్య మానుoడనై
కూపస్థప్లవమట్లువర్తిలెడు
నాగోడున్ విమర్శించి వే
నాపట్టైమనుపంగదే!
నను: నఘఘ్నా! భక్త కల్పద్రుమా!
54.
పసివాడొప్పుగ మాతపోరుడిపి భాస్వత్ప్రేంఖయందున్చి
యొ
క్క
సుగీతంబును బాడినంత నిదురం గంక్షించుచందాన రా
త్రి
సమీపించిన బ్రాణిసంతతి సుషుప్తింగాంచి తద్వ్యాప్తి గ
ష్ట
సుఖంబుల్ మఱపందు నీవగతి చూడన్ భక్త కల్పద్రుమా!
55.
ఎన్నో ప్రాణులు నెన్నో జాతులును వేరెన్నో
విలాసంబు లిం
కెన్నో
చిత్రవిచిత్రముల్ గలవు నీసృష్టిన్ భృశాశ్చర్యమౌ
నన్నా!
జీవులస్వస్వభావములు వేఱౌవస్తుతత్వంబులున్
భిన్నంబుల్;
సకలంబు నీచె యిది నేర్పే భక్త కల్పద్రుమా!
56.
ఒకచో గష్టము సౌఖ్యమొక్క యెడ నయ్యో! యంచువాపోవు
టిం
కొక
క్రేవన్ ముదమొక్క చక్కి జననంబొక్కొక్కచో మృత్యువొ
క్కొకచాయం
గల భూతలంబున బ్రభూ! యూహిoప నున్నే? స్థిర
ప్రకటానందము
జీవకోటికిని దేవా! భక్త కల్పద్రుమా!
57.
జననంబందుట వృద్ధిజెందుటయు భీష్మంబైన పాపౌఘమా
ర్జనముం
జేయుటయుం గతించుట పునర్జన్మంబు ప్రాప్తించు టి
ట్లు
నరుండుద్భవమృత్యు కిల్బిషమహారో గాoధుడై స్వస్థతం
గనగాజాలుటదెన్నడో!
గద యఘఘ్నా! భక్త కల్పద్రుమా!
58.
అణుమాత్రాఘకృతాపరాధుడిల గానట్టిండెవండుండు? గ్రా
మణి
సర్వంబుననయ్యు వాడు పరమాత్మా! సూక్ష్మదోషాత్ముడున్
గణనాతీతములైన
సంసృతి జగత్కష్టంబులం జెందునే
ప్రణుతింతున్
నను నెట్లుసా కెదవో! దేవా! భక్త కల్పద్రుమా!
59.
అజ్ఞానస్ఫురణంబనేక దురిత వ్యాపారసంఛన్న దు
ష్ప్రజ్ఞావంతుని
జేయుమానవుని తజ్జన్మంబు వ్యర్ధంబు: స
ర్వజ్ఞా!
మా యపరాధముల్ సయిచి మాప్రాపైకృపాశాలివై
విజ్ఞానంబిడి
సంతరిoపుము మమున్ వే, భక్త కల్పద్రుమా!
60.
ఎఠరాసించి ఝషంబుగాలమున కర్పించున్ స్వజీవంబులన్
నరుడక్కైవడి
గిల్బిష ప్రకటనానాలోభ మగ్నాత్ముడై
పరమాత్మా!
యమపాశబద్దుడయి తీవ్రక్లేశముల్ చెందు నిన్
స్మరియిoపన్
లవమాత్ర మోదియగునా? సద్భక్త కల్పద్రుమా!
61.
అరిషడ్వర్గపరాక్రమక్ర మవిహావిరానూన ఘోరాగ్నిలో
నిరతోద్యచ్చలభాయమాన
హృదితోనేసృక్కుచుబ్నాడ స
త్కరుణాoభోనిధి!
తద్వికారవిజయ జ్ఞానంబు నీయంగదే!
నరజన్మంబును
దాల్చినట్టి ఫలమందన్ భక్త కల్పద్రుమా!
62.
నీదివ్యాత్మయదెట్టులుoడునో? యజా! నీవాక్కులేలాటివో
నీ
దాక్షిణ్య యుత ప్రచారమెటునో! నీ యున్కి యెచ్చోటనో!
యేదివ్యాత్ము
లెఱుoగలేరన నహో! యేనేర్తునే? యీశ్వరా!
నీ
దాసుండ నఘోత్కటాధముడ తండ్రీ! భక్త కల్పద్రుమా!
63.
ఱాలున్ రప్పలు మోక్షదాయకములే!బ్రహ్మోగ్ర వైకుంఠు
లా
భీల
భ్రాజితనారకాప్తి నొగిదప్పింపంగలారే? యయా
రే!
లోకుల్ వివిధప్రవర్తనులుగారే? వారి గోలేలనా?
కొ
లోకాధిప! నిన్ స్మరిoతున్ బ్రియబంధూ! భక్తకల్పద్రుమా!
64.
“మాయామేయజగంబెనిత్యమని సoభావించి” లోభాత్ములై
నా
యిల్వాకి లివైభవార్దమని యన్నల్ తమ్ములుంబోరి గు
ట్టే
యొప్పంజను గౌరవంబువిడి యుట్టింగట్టితామందులో
నూయాలూగుదురేమో?
శాశ్వతముగా: నో భక్త కల్పద్రుమా!
65.
మృతదేహంబుల గాంచినప్డ జనులిస్సే! కైతవాకార సం
స్థిత
విశ్వoబున నెల్లజీవులును నింతే! యేటియైశ్వర్య మీ
సుతపత్నీ
సఖవర్గమేటిదని విజ్నుల్ పల్కినట్లాడి సం
తత
లుబ్దాత్మకకార్యముల్ విడువ రాద్యా! భక్త కల్పద్రుమా!
66.
ధరలో జీవులకెల్ల దుఃఖ సుఖమోదక్లేశమృత్యూద్భవో
త్కరధర్మంబుల
గూర్చి కన్గొనుచు, లోకస్తోమ నిర్మాతయే
యరుసంబందునటంచు,
సoయములు వ్యాఖ్యానించివాచించుచుం
దురిదేనిక్కువమైన
గావుమజ! నన్నున్ భక్త కల్పద్రుమా!
67.
ఎలుకంబట్టుట పిల్లికాటయగు గానీ! మూషిక ప్రాణముల్
తొలగుంగాదె!
సమస్తజీవిసుఖ సంతోషవ్యధల్, నీకహో
యెలమింగూర్చునో?
యేమొ! కాని తొలినాయీజీవముల్ కస్తిచే
దలనుంబాసియు
దోకకేగు జుమి యాద్యా! భక్త కల్పద్రుమా!
68.
తగునా! నన్నిటులీశ! సంస్కృతి సముద్రంబందు
గుందించుటల్
తగవుంబాసితినో!
నినుoదల పనో! తార్కాణగా గష్టసౌ
ఖ్య
గుణా ధర్శ పు భాఠముం గరపెదో! కాకున్న లోకంబులో
నగుబాటుప్పతిలంగ
జేతువో! యఘఘ్నా! భక్త కల్పద్రుమా!
69.
నాయాక్రందన దైన్యరావములవిన్నన్ భిన్నమౌలోహమున్
నాయశ్రుప్లుతనేత్రపద్మముల
గన్నన్ ఱాయి, నీరౌను, గా
నీ!
యన్నా! నవనీతమాట్లు మృదువౌ నీచిత్తపంకేరుహం
బే
యిప్పట్టున గ్రూరవజ్రసమమయ్యెన్ భక్త కల్పద్రుమా!
70.
కాలుండెన్నడొ, వచ్చి, మాయసువులం గట్టీడ్చి,కొంచేగున
వ్వేళo
బైత్యమొ! వాతమో! కఫమొ! యేభీవ్యాధియే జేరి మా
కోలిన్
నీస్మరణంబునల్పుటకు నయ్యో! వాయికట్టేమొ! నే
డే
లబ్ధప్రియతన్ భజింతు నిను దండ్రీ! భక్తకల్పద్రుమా!
71.
నిముసంబో! గడియో! దినంబో! నెలయో! ని:ఖేద! యబ్దంబో!
వ
ర్షములుంగొన్ని
గతిoపగా వలయునో! ప్రాణుల్ మృతింజెందు కా
ర్యముకై
నేరము గాన నేరునుమెయింబ్రాణంబులొప్పారు కా
లము
వ్యర్ధంబోనరిoపరాదు నిను జేరన్! భక్త కల్పద్రుమా!
72.
తొలగంబోవు భవాఘముల్ తివిరి మర్త్యుoడెంత యత్నిoచినన్
గలుగంబోవు
నితాంతపుణ్యకృతులున్ సత్కామితార్ధoబులున్
అలరంబోవు
పవిత్రమోక్షసుఖనిత్యప్రాప్తి సంధానముల్
వెలయన్
నీ కృపయున్న గాని కరుణాభ్దీ! భక్త కల్పద్రుమా!
73.
చటులోద్దూతతరంగపంక్తు లుదధిన్ సంక్షోభమొoదించు టె
ట్లటులీ
భూమిని పార్ధివప్రకర దుర్యత్నాతిలోభంబుచే
గుటిలాత్యుల్
చెడుటొoడుకాక సుజనుల్ కోల్పోదురాయు: ప్రదల్
కట యీ ఘోరము
నీకు హర్షమే! యఘఘ్నా! భక్త కల్పద్రుమా!
74.
లోకాచారములెన్ని యేవిధములన్ లోపించు రూపించు ధ
ర్మైకస్థైర్యమునందవెన్నడును
దప్పే! యొప్పుగా నొప్పు త
ప్పేకా
యంచు స్థిరీకరించు నిక బృద్వీధర్మవిశ్వాసముల్
నాకెన్నండునులేవు
నిన్దలతు నన్నా! భక్త కల్పద్రుమా!
75.
తలపుల్ నీపయి, జిత్తమెల్లపుడు నీధ్యానంబునన్,
వాక్కు నీ
లలితానంతమహాద్భుతామరకధారమ్యస్తవంబందునన్
నిలుపంజాలెడు
సక్తిభక్తి యిడి నీ నిర్ణిద్రనిర్వ్యాజ ప్రే
మలతాబద్ధుని
నన్నొనర్పుము మహాత్మా! భక్త కల్పద్రుమా!
76.
అనృతంబుల్ వచియిoపుమన్న బరమాహ్లాదాన బర్వెత్త సా
గును నా
నాలుక! యెట్టిపాపమొ! పృధుక్రూరత్వముందాల్చు స
త్య
నిరూఢిoబ్రకటించుమన్న: నది నాయజ్ఞానమో! కర్మమో!
యనఘా!
తత్పధముక్తి నిచ్చిగనుమయ్యా! భక్త కల్పద్రుమా!
77.
ధరనేప్రాణిము జేయుకార్యము స్వతంత్రత్యక్తమైనట్టి దం
ట,
రహిన్ నీవొనరింపజేసెదట, చూడంబాపపుణ్యoబులున్
నరకంబుం
దివిమమ్ము బాయవట విoతంగొల్పు నిమ్మాట లో
నరయన్,
నిక్కమునీవెఱుoగవలె సుమ్మా! భక్త
కల్పద్రుమా!
78.
కనులంగప్పిన కావరంబు కతనం గర్తవ్యమున్ రోసి ధ
ర్మనిరోధోచితకార్య
సంతతుల జల్పంబూన బెర్మ్రోగినా
డను నీదాసుడ
నిoకనైన గృపతోడన్ యుక్తమార్గంబులో
నను
వేద్రిప్పు కొనంగదయ్య దురితఘ్నా! భక్త కల్పద్రుమా!
79.
ఔరా! నాలుగునాళ్ళ జీవితమునందా! చిత్రచిత్రాoబరా
గారంబుల్
రచియిoచునాశల గడుం గల్పిoచుటల్ మాకు; వ
హ్వారే!
సౌరభరాసిచంపకము క్రేవంగాల ఘోరాహియా!
నేఠoజాల
భవస్మహమహిమ తండ్రీ! భక్త కల్పద్రుమా!
80.
ప్రకటంబైన భవద్దయా ప్రభలనే వాంఛిoపగానొండు తా
కికశశ్వద్వ్యవహార
సంగతుల రక్తిన్ వీడ గానొక్కడ
త్యకలంకాత్మక
సత్ప్రవర్తనముపై హర్షంబు పెంపొoదున
ట్లొక,
డీమూ డువరాలనిమ్మ, కరుణాళూ! భక్త కల్పద్రుమా!
81.
అలఘత్యాగము, శీలశక్తియు, వివేకానందభాగ్యంబు, ని
ర్మలమైనట్టి
త్వదీయభక్తిబల, మశ్ర్రాంతంబుమాకిచ్చి, పా
పులుపో
జాలుపథంబు చక్కికి మముంబోనీక కాపాడి, యీ
విలసజ్జన్మము
దాల్చినట్టి ఫలమీవే! భక్త కల్ప ద్రుమా!
82.
కోపంబొక్కడసూయయె, డ సహనక్రూరత్వమొక్కం, డవి
ద్యాపారత్వమొకండు,
జ్ఞానరహితా యత్తాత్మయొక్కం, డహో
మాపంజాలెడు
దుర్గుణ ప్రకరముల్, మాజీవితానందమున్
మాపట్టైవడివీని
ద్రుoపుము, మహాత్మా! భక్త కల్పద్రుమా!
83.
స్మరణీయంబగు లక్షతల్లుల కృపాస్వాoతమ్ములన్ మించు,
స
త్కరుణాత్ముండని,
నిన్నుమ్రోక్కెదరు. ప్రజ్ఞాపూర్ణులున్ బామరుల్
ఎఱుగంజాలకయో!
ప్రమాదముననో! యెన్నేనిదోషంబులన్
నిరతింజేయుచునుంటి
బ్రోవునను దండ్రీ! భక్త కల్పద్రుమా!
84.
ఇక సైనంగరుణించి నన్ను గరుణాబ్దీ! చయ్యనన్ సాహితీ
ప్రకటానర్గళ
మాధురీ కవనధారా శుద్దినీయంగదే!
ఆకలంకమ్మగు
జ్ఞానతేజమిడి, హేయంబైన సంసారపు
న్వికలత్వమ్మును
బాయ జేయ గదె తండ్రీ! భక్త కల్పద్రుమా!
85.
నిరతిన్ దుర్వ్యధలెన్ని వచ్చినను రానీ! సౌఖ్యమన్
మాటయే
కఱవైపోయిన
బోని! సత్కవితనా కాంక్షించుమన్మానసం
బరయన్
సార్ధకమందునేని, నదియే యస్మన్మహా భాగ్యమం
చురహింగాంతు!
యశోవిశాలతవహిoతున్! భక్త కల్పద్రుమా!
86.
కవితాసృష్టియనంగ నీదువలనం గల్పిoపగా బడ్డ సృ
ష్టి
విశేషప్రతివస్తునై జగుణముల్ సేవ్యానుధర్మంబులున్
వివరింపంగల
శక్తి కాదె? కరుణాబ్ధీ! దాన నీ యద్వి తీ
యవిలాస
ప్రతిభా ప్రభల్ స్ఫుటము కావా! భక్త కల్పాద్రుమా!
87.
సిరులిమ్మంచును గోరలేదు,
విభావశ్రీ వాంఛయున్
లేదు, సు
స్థిరకాంక్షామతికాదు
భూషలకునై చే మోడ్ప గాలేదు, స
త్కరుణాసాగర!
మెక్కగూడు వలువల్ గట్టంగమాకిచ్చుటే
బరుదౌ
కార్యముగా గ దోచెనొకొ! దేవా! భక్త కల్పద్రుమా!
88.
అన్నా యెన్నివిధాలవేడినను, మొఱ్ఱాలింపకున్నావు నీ
కన్నన్
రక్షకులెవ్వరింక? దయతో గాపాడినంబోలదో!
యన్నార్తుండ
ననల్పదీనుడ ననన్యత్వత్క్రుపా పాత్రుడన్
సన్నాధా!
ననునే చధర్మవగునే? సద్భక్త కల్ప ద్రుమా!
89.
ననురక్షింపగ నిచ్ఛయున్న గరుణానాధుండ నీవైన నీ
పనియేదీన
జనావనoబయిన భాస్వద్ధీనిధుల్ పల్కు నీ
ఘనతల్
నిక్కమయైన గ్రక్కు నననుం గావంగ వీక్షిoపుమ
య్య!
నినున్ నమ్మితి నిర్మలాత్మ, నకలంకా! భక్త కల్పద్రుమా!
90.
సగుణుండంచును నిర్గుణుoడనుచు ధీశవ్రాతమే భిన్నభి
న్నగుణప్రాంచితమైనుతిoచెడునినున్
నాస్వల్పపుంబుద్ధికిన్
సగుణబ్రహ్మగగాక
నిర్గుణునిగా సర్వామరాధ్యక్షుగా
బొగడన్
గోర్కిజనిoచునెప్పుడు స్వయంభూ! భక్త కల్పద్రుమా!
91.
ఏలారావు? మొఱాoలకింపవు? విభూ! ఏమూలనున్నావు? నీ
మ్రోలంగుయ్యిడు
నాదుదీనవచనంబుల్ నీచెవిన్ సోకవో
వాలాయంబిదియే
టి గోలయనుచుం బాలింపకున్నావో? నీ
వేలీలంగనిన్
మదీయగతియీవె! భక్త కల్పద్రుమా!
92.
మీకర్మానుసృతిన్ ధరన్ గలుగు బో మీకున్ సుఖక్లేశముల్
నాకేశంకయులేదు
నా బలికెదో! నాధాగ్రణీ! యేరికై
లోకాళిన్
సృజియించిమన్చి లయమున్ రూపించెదో! నీకు నీ
లోకంబందున
నీశ్వరత్వ మదియేలో! భక్త కల్పద్రుమా!
93.
మున్నొక్కండవు నున్న వేళహృదికే మోదంబు సంధిల్ల కో
యన్నా:
స్థావరజంగమాత్మకపు బ్రహ్మాండంబునిర్మించి నీ
ఖిన్నత్వంబును
బాపుకొంటినిక మాక్లేశoబులంద్రుంప నీ
కన్నంగర్తమఱెవ్వడుండె?
నకలంకా! భక్త కల్పద్రుమా!
94.
ఎపుడో జన్మమునందుడింభకులనెం తేగావ గా స్త్రీలకున్
విపులాంచత్కుచముల్
రచించితివి తెన్నేలేనిపాషాణమం
దెపుడున్
వాసమొనర్చుకప్పకు బ్రియాహీనాన్న ముంగూర్చినా
వు
పరంధామ! ననుంగసుంగొన గరావో! భక్త కల్పద్రుమా!
95.
నారుంబోసినవాడు నీరములరాణంజల్లనేరండొకో
గారామారమమున్
సృజించితి విభూ! కారుణ్యసమ్మార్తి! యు
న్నారా!
గోడుడుపం గృతాఘములడిందంజేయ గానన్యులే
లారక్షిoపనిదేకదా!
యదనుదేవా! భక్త కల్పద్రుమా!
96.
కొరిడెక్కించితి కూల ద్రోసితి కృపాకూపార! మత్కర్మమ
ట్లుండెంబోలునటంచు
నెట్లు హృదియందూహింతు! దోషాత్ములున్
మెండౌభక్తిని
నిన్ స్మరించి సుఖమున్ మేల్గాంచరే! బాపురే!
యొండేలా!
నను గావనీవగతి సుమ్మో భక్త కల్పద్రుమా!
97.
కాలంబెల్లనిజోదరా వనముకై కష్టింపగానౌను కా
బోలుం
గాకివలెన్ నిరర్ధకముగా ముప్పూటలున్ సాహితీ
హేలాంగీమధురాధరామృతము
లెంతే గ్రోల నాసించినం
బోలన్
సుంతఫలంబొసంగ వదియేమో! భక్త కల్పద్రుమా!
98.
మృదువాక్పూరితమై రాసోచితమునై మేల్మేలునానర్ధ సం
పదలంగూడి
విశాలభావయుతమై వాసించునత్యాసువై
విదితోద్వేలమనోజ్ఞలక్షణ
సమావిర్భూతమైయొప్పుకై
త,
దయన్ నాకిడనిన్ స్తుతిoతు బరమాత్మా! భక్త కల్పద్రుమా!
99.
సిరులున్ వైభవముల్ పురాకృతవిధి శ్రీకారణార్ధంబునన్
నరునిం
జెoదునుగాన దుర్మదము డెందంబందునంబాసి స
త్కరుణా
చిత్తముతో సుధర్మరతితో ద్వద్భక్తితో బ్రేమతో
ధరణిన్
శ్రీవరు డుంటలెస్సయగు నాద్యాభక్త కల్పద్రుమా!
100.
సుకమందేసిలుగున్ రచించితివి ప్రక్షుద్రార్తి
నానందమం
దెక
కల్పించితి మాహితంబుకొఱకై నీసృష్టిచాతుర్యముం
బ్రకటంబైన
త్వదీయబుద్ధిబలమున్ వర్ణింపగా నెట్టివా
రికినైనం
దరమౌనొకో! ప్రియపుదండ్రీ! భక్త కల్పద్రుమా!
101.
చలికిన్ వానకునెండ వేడికయినన్ సైరింపదీకాయ మ
ప్ప్పులవాండ్రంబలె
రుగ్మతల్ కదిసి రేపున్ మాపు బీడించు జీ
వుల
వేటాడగ గాలకింకరగణoబుల్ సిద్దమైయుండు నిo
క
లలిన్ గాoచుటరెప్డు! ప్రాణులకలంకా! భక్త కల్పద్రుమా!
102.
మృతియన్ సంద్రము దాటియావలి రహస్యైకక్రమోదoత మే
మతిమంతుండును
వెండిరాడు ధరకున్ మాకుంబ్రబోధిoప గా
దతచిత్రంబగు
మృత్యనంతర కధా తత్త్వంబగమ్యంబుగా
నతిగోప్యంబుగనుంచి
తెoదులకొ? దేవా! భక్త కల్పద్రుమా!
103.
ఆశాపాశము ద్రెంచుచోనఘము మర్త్యశ్రేణికిన్ లేదటం
చీశా!
ప్రాజ్ఞులు నిర్వచింతురు కృపాబ్దీ! మానవోత్పత్తియే
యాశాపాశనిబద్ధ
మక్క తన ధర్మాయత్తమౌ కోర్కులం
దాశల్
గాఢముగా జెలంగ వరవిమ్మా! భక్త కల్పద్రుమా!
104.
ననమానంబగు సత్ఫలంబువిడు సంతానద్రుమంబున్ క్షుధన్
నెస జల్లార్పగ
బండ్లగోరు నధమాభిప్రాయుచందాన దు
ర్వ్యసనగ్రస్తములైన
వైభవములన్ ద్రవ్యంబులన్ సౌఖ్యపు
న్విసరాళిన్
నినుగోరజాలను గృపాబ్దీ! భక్త కల్పద్రుమా!
105.
వెను వెంటన్ సతముంజరింప గల పృధ్వీనాధు వాక్షిణ్య
మొం
దన పేక్షింపక,
ద్వారపాలకుదయన్ వాంఛిoచునీచాత్ముభం
గి
ననల్పప్రణయప్రభావు, డవు నిన్ గీర్తింప గాలేక క్షు
ద్ర
నృపౌఘంబును బొట్టకైకొలువజాలన్ భక్త కల్పద్రుమా!
106.
నాకర్తవ్యముబోధసేసి ప్రభువా! నన్ బిడ్డనుందండ్రిలా
గే
కాలంబును సంతరింపుము రవంతేనీవు పేక్షించినన్
నాకేకాదు
సమస్త లోకమునకున్ శ్వశ్శ్రేయసంబబ్బునే?
ప్రాకట్యంబగు
రాణచేకుఱునె? దేవా! భక్త కల్పద్రుమా!
107.
కుటిలాచారములుజ్జగిoచెద గృపాకూపార! విద్వేషహృ
త్పుట
యత్నంబు బరిత్యజించెద గుణస్ఫూర్తింబ్రవర్తించెదం
బటువర్ణాoచిత
ధర్మభిన్న గుణముల్ పాలింపకుందుం ద్వదు
త్కటభక్తిన్
విడకుoదు గావుమెపుడాద్యా! భక్త కల్పద్రుమా!
108.
భక్తిందావకనిర్మలస్మరణ సంపత్పావనానంద స
చ్చక్తింగైకొని
యైహికాగణితకష్టస్తోమముం గొంత మ
చ్చక్తిన్
వ్యక్త మొనర్చిదా టెదను భాస్వన్మోక్షమీయంగదే!
భక్తాళీపతి!
నిన్ స్తుతింతెపుడు దేవా! భక్త కల్పద్రుమా!
109.
ప్రాయంబిర్వదిరెండు వర్షములలో బాల్యంబురెండెన్మిదుల్
పోయెం
దక్కు గలట్టి యాఱుసమలున్ మూర్ఖత్వమందొప్పగా
యోయన్నా!
భవదీయ సత్కరుణచే నొక్కింత విజ్ఞాన మీ
ప్రాయంబందున
గల్గె నిన్మఱువ దేవా! భక్త కల్పద్రుమా!
110.
ఋతమున్ శౌచము శీలముం దయయు నీయింపారుసద్భక్తియున్
సతమై
మానసమందునిల్వ; నను నిస్లామ్ వంశ్యు సఛ్చీల హృ
ద్యుతుయుష్మత్కరుణాభిలాషు
మహమద్ హుస్సేన్ సమాఖ్యున్ గృపా
మతిచే
నేలుకొనంగదయ్య! పరమాత్మా! భక్త కల్పద్రుమా!