Wednesday, 17 August 2016

శ్రీ మిత్రా శతకము



శ్రీ మిత్రా శతకము
ద్విశతి

శ్రీకారమాది నిలిపిన
నా కృతి శ్రేయః ప్రదమ్ము – నా యుష్కరమున్
ధీకస్తుత్యము" - నగునని
వాకొనెదరు విబుధులెల్ల - వరముగ మిత్రా!

                                                                               
అవతారిక
సుమతీ శతకము మాదిరి
విమలంబగు సరళనీతి – వివరించుటకై
తమి గలిగె - రచన సాగెను
క్షమియింతురు నెఱసులున్న - సరసులు  మిత్రా!


ఏనాఁటిబద్దెన నృపుం,
డే నాటిది సుమతి శతక - మీనాఁటికిఁద
న్మానవత దెలుపు నీతుల
స్థానం బే శతకమూనఁజాలెను మిత్రా!  

ఒక్క సమాసము గానీ!
ఒక్క నిఘంటూక్తిగాని యొక వ్యర్థపదం
బొక్కెడను బ్రయోగించిన
కక్కూరితిగాని లేదు కదరా! మిత్రా!

ప్రతి పద్యమ్ము స్వతంత్రము
ప్రతి పాదమ్ము నిరపేక్ష్య పర భాగమ్మున్
ప్రతి వాక్కు - చక్కని రసో
చిత - ముపమానోప దిష్టచిత్రము మిత్రా!

సారమగు కవిత చదివిన
ధీరులకడవిన్న దెలివితేటలు పెరుగున్
ప్రేరణ కలుగును నీతికి
నారయు మానందతృప్తు – లలరును మిత్రా!  

చదివినను విన్న నీతులు
మదికింపేకాక – మనువు మలుపుల యందున్
గదియించును సారధ్యము
పదిలంబగు పూల బాట పఱచి - సుమిత్రా!

తన రచియించిన కృతిగని
విని సరసులు సన్నుతించు వేళల గవికిన్
జనియించెడు సంతోషము
కనకపు గట్టందుకొన్న గలగదు మిత్రా!

కవి రసికుల మెప్పించును
కవి సంఘ శ్రేయమెసగు కావ్యము లిచ్చున్
కవి ప్రగతికి వారసుడగు
కవి – సభ్య సమాజ కల్ప కంబుర, మిత్రా

విని పద్యమ్మును – భావ
మ్ము నెఱిoగి – రసము తఱచి – మురుపును బ్రకటిం
చి నరసికులె కనరారే  
మన వలె  గవి శ్రమకు ఫలమిదా ! కవి మిత్రా

కవన భరమ్ములు చదువులు
కవనమ్ములు నృత్య గీత కలనమ్ములురా!   
కవనమ్మన బ్రతిభావై
భవమన్నది విస్మరింప వలదుర! మిత్రా

అదలించును, గదలించును,
ముదమొదవించును, గరంచు, - మొగిబ్రేరేచున్,
మెదలించు నేదోదినమున,
నదిరా! రసవత్కవిత్వ – మతులము మిత్రా

కవనమ్ము కుడువనిడునా!
సవరంగా వలువగూర్ప – సరిపడునా! యం
చవివేక సరణిబలుకకు,
కవనమ్మున జ్ఞానసిద్ధి కలుగును మిత్రా

సుందరియందము డెందము
నందున స్పందన మలందు నట్టులు – కవితా
సుందరి యందము రసికా
నందామందాను భూతి నలరుచు మిత్రా

రసికుల కిచ్చును – గవితా
ప్రసవాంగి – సుధాధరార్ధ్ర పరమానంద
వ్యసనైక పారవశ్యము
రసికునకిడు యౌవనాంగిరతమై – మిత్రా

కవిత వినకున్న నష్టం
బెవరికిరాబోదటన్న – నెకసకెమేలా!
కవిత హృదానందము బు
ద్ధివికాసము యశము, గూర్చు దెలియుము – మిత్రా

రసవిశ్రుతి నేరని మా
నిసి – కావ్య శ్రవణ సౌఖ్య నిరతింగనునా!
మసలక – కసవునుమెసవెడు
పసరము కుందాను భూతి బడయునె ! మిత్రా !

గద్యము కన్నను పద్యము
హృద్యమ్మై – మధురగాన హేవాకమ్మై
సద్యో హ్లాదదమై – యన
వద్యమ్మై – కర్ణ పేయభరమగు మిత్రా

ఈ కంప్యూటరు యుగమున
రూకలిడగలేని నీతిలోలుప – శతకం
బాకాంక్ష జూతురెవరని
సీ కొట్టకు – ప్రాజ్నులుంద్రు – చెవినిడ – మిత్రా

ఇమ్మగు ననుగుదెనుంగు ప
దమ్ముల కవనాన సంస్కృతమ్మదియేలా!
కమ్మని తేనియలో మధు
రమ్మగు శర్కర యదేలరా! కవి మిత్రా!

పిలిచిన – నులకదు – పలుకదు
కలగి పెడమొగమ్ము సూవు – కవితాంగన – తా
వలచిన గులుకుచు గిలిగిం
తలిడంగా నన్ను జేరు – నవ్వుచు – మిత్రా

ముదుకతనమ్మున బొడమి న 
ది – దుహిత యిది – నీతి చతుర – దీనిబెడంగుల్
మది మెచ్చెదరో! తలలూ
చెదరో! కోవిదులు – వారి చిత్తము – మిత్రా               






the satakam will be uploaded within a short time. sorry for the inconvenience
ఈ శతకమును అతి త్వరలో ఇచట ఉంచెదను. అసౌకర్యమునకు చింతిస్తున్నాను.

No comments:

Post a Comment