శ్రీకారమాది నిలిపన
నాకృతి శ్రేయః ప్రదమ్ము - నాయుష్కరమున్
ధీకస్తుత్యము" - నగునని
వాకొనెదరువిబుధు లెల్లవరముగ మిత్రా! 1
అవతారిక
కం: సుమతీ శతకము మాదిరి
విమలంబగు సరళనీతి - వెలఇంచుటకై
తమిగలిగె - రచన సాగెను
క్షమియింతురు నెరసులెంచు - సరసులు మిత్రా! 2
కం: ఏనాఁటి 'బద్దెన' - నృపుం -
డెనాఁటిది సుమతి శతక, మీనాఁ టి కిఁ ద
న్మానవత దెలుపు నీతుల
స్థానం బేశతకమూనఁజాలెను మిత్రా!
3
కం: ఒక్క సమాసము కానీ
ఒక్క నిఘంటూక్తిగాని యొక వ్యర్థపదం
బొక్కెడను బ్రయొగించిన
కక్కూరితిగాని లేదుకదరా! మిత్రా! 4
5
కం: ప్రతి పద్యమ్ము - స్వతంత్రము -
ప్రతి పాదమ్ము - నిరపేక్ష్యపర భాగమ్మున్
ప్రతి వాక్కు - చక్కనిరసో
చిత, ముపమనొపమేయచిత్రము - మిత్రా! 5
కం: చదివినను - విన్న- నీతులు
మదికింపేకాక, మనువములు పులయందున్
గదియించును సారధ్యము
పదిలంబగు పూలబాట - పఱచి - సు మిత్రా! 6
Rama, u did a great job. congrats and thank you
ReplyDeletefine boss
ReplyDelete