తెనుగుబాల
నీతి శతకము
క్రుతిబాల
రచయిత : మహమ్మద్ హుస్సేన్ కవి
మాతృశ్రీ : హుస్సేన్ బీబీ
పితృశ్రీ : ఉపాధ్యాయ శిరోమణి, సిలార్ సాహెబ్
ప్రశంస
తెనుగు బాల కృతిపతి
శ్రీ రేమళ్ళ జగన్నాధరావుగారు, దుగ్గుదుర్రు,
తూర్పు గోదావరి జిల్లా
1. శ్రీమద్ “రేమళ్ళ కులా
రామవసంతా! యశోవిరామదిగంతా
శ్రీమంత! “జగన్నాధసు
ధీమణి! నా కృతిని గొనుము “తెనుగుంబాలన్”
2. అవపద్య శీలసంప
ద్ఘన చరిత వెలార్చు ప్రోడ! కవితానీరా
జనమిదే! కైకొమ్మా! బహు
జనికృత సుకృతి ప్రదానసారము సుమ్మా!
౩. ప్రభువుల
వంశమందు బ్రభవమ్మునుగాంచి,యుదాత్త లక్షణ
ప్రభువుగ గ్రామపాలన భరమ్ము కరమ్ము వహించి, సాహితీ
ప్రభువుగ, నా ‘యలంతి కృతి’ భర్తవునై, యొకవన్నెగాoచునో
ప్రభువుర! యిచ్చుగాత ! భగవానుడు నీకు జిరాయురున్నతుల్
4. ‘రేమెల’ వంశమన్నది, చరిత్ర బంగరుకు పూతబూసెనో
భూమి పవర్య! సత్కవులు, భూరిబలాధ్యులు జిత్రకారు, లు
ద్దామధరా భృదగ్రణులు, దానగుణా వరకర్ణు,లెoదఱో
ఈ మహిదల్కులాబ్ధిని! రచించి వహించిరి రత్నదీధితుల్
5. ధనదాన్యా వనివాహనాదిక మహేంద్రశ్రీ సమార్జింపజా
లినవారల్ కలరెoదఱేనియు ,రసార్ద్రీభూత జీవత్కళా
ధనులున్, శాoతులు ,కీర్తికాము, నితాoతస్నేహ శీలోన్నతుల్
నిను బోల్పంగలవార, లెచ్చటనో కాని ,కానరారియ్యెడన్
6. ఇమ్మగు నీతులచే ‘గృతి’
కమ్మదనమ్ములకు నిమ్ముగా, బుధజనలో
కమ్ము ‘సెబాసన’ బొల్చెం
జుమ్మా! కరమూతయిమ్ము! సుయశముగొమ్మా
7. ఇది ‘యలతికృతి’ యటంచెద
విదలింపకు, డెల్ల నీతివిమల పథంబుల్
గదియంగ బిన్న పెద్దల
హృదయస్పందన మెలర్చి – హితము ఘటించున్
8. ముప్పదైదేండ్ల వెనుక నా సొంత జదువు
పట్ల, నాటి మీ బాల్య రూపమ్ము దలచి
భక్తి భయ మౌగ్ధ్య భావాలపనులదలచి
నాదు మైబుల్కలగు, జగన్నాధరాయ
9. నలఘుశ్రీలకు మేటి వారసులు నాంధ్ర క్షత్రియుల్, పౌరు షో
జ్జ్వల వంశీయులు, పద్మనాయకులు రాజ్యప్రాజ్యమూర్దాభిషి
క్తులు, కావ్యేందిర కుంబ్రియుల్, పితలు, దక్షుల్ నిగ్రహానుగ్రహా
ర్ద్రలన సచ్చిత్తులు ,నాశ్రితామరతరుల్ ధర్మైక రక్షాపరుల్
శ్రీ రేమెల్ల వెంకట రామ జగన్నాధరావు
(మురళి) గారి గురించి
జనకుడెన్నడోగైకొన్న “తెనుగుబాల”
కృతికి మలికూర్పు కూర్చిన కీర్తిశాలి
మహిత “కరుణా సమాజ” నిర్మాణ కర్త
అనఘ, మురళీ నమాహ్వ యునభినుతింతు
“దంపతులు” కృతిపతి సముదాత్త గుణుడు
దేవతార్చనా సేవనాధ్యేయ నిరతు
లేమిని గణింపనివదాన్య తామనస్వి
అనఘు మురళీ సమాహ్వయునభినుతింతు
అసలుసిసలు, నిరాడంబ రావలంబి
మాట తేటల సూటి – యమాయకుండు
చేతల నిజాయితీ ప్రీతి జెందువాడు
“మురళి” – సరససారస్వత – తరళరవళి
అభిప్రాయాలు
ఆంధ్ర ఆస్థానకవులు
కవి సామ్రాట్, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, విజయవాడ
ఈ “తెనుగుబాల” చిన్న పొత్తము మహమ్మద్ హుస్సేన్ కవి బాలకుల కోసం
రచించిరి. ఈయన మంచి కవి. పిల్లల నీతికోసము ఈ గ్రంధము వ్రాయబడినది. పాఠశాలలో దీనిని పిల్లలకు పాఠ్య గ్రంధముగా పెట్టినచో పిల్లలకు ఎక్కుడు
ఉపకారము – ఈ కవిగారికి నుపకారము.
(సం)విశ్వనాథ
సత్యనారాయణ
31
-౩ -74 విజయవాడ
ఆశంసనము
ఆంధ్ర పురాణ కర్తలు, మహాకవులు,
బ్రహ్మశ్రీ మథునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు, రాజమండ్రి
ద్వారకాతిరుమల పరిసరమైన దొరసానిపాడు వాస్తవ్యులు శ్రీ మహమ్మద్
హుస్సేన్ గారు తాను వ్రాసిన “తెనుగుబాల” నీతి శతకములోని పద్యములను
రాజమహేంద్రవరములో వినిపంపగా విని, సాధూచ్చారణ, సమర్ధమైన ఆయన కంఠస్వరమునకు, ముచ్చట గొల్పు పద్యరచనకు అచ్చెరుపడి, మహమ్మదీయులయందిట్టి
తెనుగుభాషాను షక్తి తొల్లిటి నుండి ఉండుటయే కాక, పిఠాపురమున ఒకనాటి ఒమర్ ఆలీషా కవిగారి మహోపన్యాస ధోరణి, కవితా సరళి, తలంపునకు రాగా , మఱిoత హర్షము కలిగి, మఱియు నా
యెడల హుస్సేన్ గారికి, గల విశ్వాసమునకు వశుడనై, ఈ “తెనుగుబాల” శతకము బాలబాలికలకు
కంఠస్థమై చక్కని నీతులను గరపుచు ప్రచారములోనికి రాగలదని యభిప్రాయపడుటయే
కాక, ఆయన రచనాకృషి, క్రమముగా ప్రౌఢమై ఫలిoచును గావుతమని ఆనందవత్సరాద్యాశీస్సులోసగుచున్నాను.
రాజమండ్రి,
24-3-74 (సం ) మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
కరుణశ్రీ శుభాకాంక్షలు
ప్రసన్న
కవితా సామ్రాజ్యాధీశులు
బ్రహ్మశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి
మహాకవీoద్రుల
ఆశీస్సు
అనుగు సోదరులు మహమ్మద్ హుస్సేన్ గారికి –
మీ “తెనుగుబాల” చదివినాను. చాలా సంతోషించినాను. “భావి భారత
భాగ్యవిధాత “ లైన పసిపాపలకు ఆవశ్యకములైన నీతులు తేట గీతులలో అందించినారు .
“ముఖము కడిగి, స్నాన మొనరించి, వలువలు గట్టి, తలను దువ్వి, బొట్టు
పెట్టి,
చలిది మెసవి, బడికి సన్నద్ధుడవుక ”మ్మని
క్రమపద్ధతిలో విద్యార్థిని హెచ్చరిoచుట ముచ్చటగా నున్నది.
చలిది మెసవి, బడికి సన్నద్ధుడవుక ”మ్మని
క్రమపద్ధతిలో విద్యార్థిని హెచ్చరిoచుట ముచ్చటగా నున్నది.
‘చీమకైన హాని చేయరాదను ,మాట :హృదయమున్నవారలేగుబాట
ఎల్లజీవులoదు నీశు నొక్కoడౌట’
అన్న అహింసా ప్రబోధము పసందుగా కుదిరినది.
‘ఆత్మ గౌరవoబు లందరిసొత్తు, నీ :కోక్కరునికి జేబురోక్కమగునె ?
మన్ననంబొసంగి మర్యాదగాoచరా!"
అన్నమాట వరాల మూట
“కవుల పలుకులన్న గలకండ పలుకులు:కవనమన్న మలయపవనమె సుమి
అమల కావ్యమన్న ఆనంద గుళికరా!"
అని బాలల పసి హృదయాలలో కవులపైన, కావ్యాలపైన, గౌరవము కలిగించుట
ప్రశoసనీయము
“తాటికాయలoత తమతప్పు లెఱుగరు : పరుల నలుసులెన్ను ప్రభువులoత
కడుపులోని క్రుళ్ళు గ్రహియింతురెవ్వారు”
అన్న నీతి లోకరీతిని చాటులేకుండ చాటుచున్నది. ముందు ముందు మీ ఛoదము
మరి కొంత అందము నందుకోవలసి యున్నది . మొత్తము మీద మీ రచన రమణీయము. ఆదరణీయము .
ఇంతకు ముందే నేను “తెలుగుబాల” రచించితిని. నా “తెలుగుబాల” వలెనే , మీ
“తెనుగుబాల” కూడా లక్షప్రతులు పైగా చెల్లి తెలుగునేల నలుమూలల వెలుగులు వెదజల్లి
జనతలో ఘనతగాంచవలెనని నా ఆకాంక్ష .
త
థా స్తు
గుంటూరు
16-4-74 మీ కరుణశ్రీ
స్మరణ
జననీ! సాత్విక భావభూషణ ఘృణీ! సాజన్య సౌదామనీ
పెనుక్షామమ్ములు, గాంచి – పెక్కిడు మలన్
వీక్షించి – సైరించి – నీ
చనుబాల్ సత్త్వ మొసంగి సాకితివి – నా సాహిత్యవైదగ్ధ్య సం
జనకం బెన్నోకృతుల్ వెలార్చితి – కృతజ్ఞత్వంబు
చెల్లించెదన్
ననుముద్దారగ – నగ్ర పుత్రుడని – విన్నాణం బునన్
బెంచి - పె
ద్దను గావించి – సుభాశిషంబులిడి - విద్యా బుద్ధులన్ నేర్వజే
సిన మాయమ్మ “హుసేను బీబి “ – ఋణమున్ జెల్లింతునేనెట్లు
? చం
ద్రున కర్పించెడు నూలు పోగనగ గూర్తున్ – నా
నమోవాకముల్.
జనకా! దేశికవృత్తియందు - నిను మించంజాలు,
వారెవ్వరున్
గనరా “రన్నయశమ్ము గాంచితివి, రంగ గద్వైద్య రంగమ్మునన్
జను “లోహో“ యనుకీర్తి గొంటివి ‘సిలార్ సాహెబ్ ‘ –
ప్రసిద్ధాహ్వయ
మ్మున వేనోళ్ళ పొగడ్త లందితివి - కైమోడ్పుల్ -
గ్రహింపంగదే !
కుమారుడు
దొరసానిపాడు మహమ్మద్
హుస్సేన్
ఆకాంక్ష
ప్రాధమిక విద్యా నవోద్యానంలో రంగురంగుల
సీతాకోకచిలుకల్లాంటి చిన్నారి చిట్టిబాలలూ !!!!
తీయతీయని మాటలతో, ముద్దారు లేనవ్వు ముఖంతో,
మురుపులొలికే చూపులతో, “న్యూ మోడల్ డ్రెస్సుతో” ఘల్లు ఘల్లు రనే కాలి అందెల
రవళితో,బంగారు రంగు లీనే మేని సోబగుతో, కలకల్లాడుతూ, మిమ్మల్ని పలకరిoచడానికి,
నవ్వించడానికి, సరదాగా కథలు చెప్పి కాలక్షేపం చేయించటానికి ఆనంద డోలికల్లో
ఊపడానికి, నా యీ యనుంగు – బాల కృతి, మచ్చికపడిన పావురపు పిల్లలాగున ,
రివ్వురివ్వున ఎగురుతూ, మీ చేతుల్లోకి వచ్చింది.
ఇపుడు దీన్ని మన్నించడం, ఆదరించడం, గుండెకు
హత్తుకొని అలరిoప చేయడం, తేనెలూరే ముచ్చట్లతో ఆప్యాయత కురిపించడం, అదంతా మీరు చూపే
నేర్పులో ఉన్నది నమండీ!!!!
ముద్దుగా ఒక్కసారి పలకరించారా! కమ్మని నీతులు కావలసినన్ని
ఏకరువు పెడ్తుంది.
నిండు మనస్సుతో ఆదరించారా! కర్ణపేయంగా చిటిపాటి
కబురులెన్నో చెప్పి, మిమ్మలల్ని కిలకిల నవ్వించేస్తుంది.
ఉత్సహించి పాడిoచారా !
అమృతగానంతో మీ ఒళ్ళు పులకరింప జేస్తుంది.
స్వాగతం చెప్పి ఆతిధ్య మిచ్చారా!
మిమ్మల్ని గొప్పవారుగా తీర్చిదిద్దే ఎన్నో
ఆదర్శాలు కథల పరీమళాలు వేదజలల్లి మత్తేక్కిoచేస్తుంది.
పన్నీటి మాటలతో అభిమానం ఒలక పోసారో !
మీ హృదయాలను సుసంస్కరించే విద్యాబుద్ధుల “సెంటు”
జల్లులతో నింపి మిమ్మల్ని సంతోష పారవశ్యంలో ముంచెత్తి వేస్తుంది.
ఇక మీరే ఎన్నుకోండి!
నా ఈ చిట్టి కృతిబాలను
ఎలా
పలకరించాలో!
ఎలా
ఆదరించాలో!!
ఎలా
గౌరవించాలో!!!
దొరసానిపాడు, ఇట్లు,
19-1-1974 సదా విదార్ధిలోక శ్రేయోభిలాషి
మనవి
వరసాహిత్య కళాభిమానము లెలర్పంగా నుపాధ్యాయసో
దరులారా సహదేశికోత్తమని యత్నంబున్ విలోకించి, సా
దరచిత్తంబున నన్నుగాంచుడు! సముద్యద్భుద్ధి
సంపద్విభాః
సుర విద్యార్ధుల బ్రోత్సహింపుడు !నమస్సుల్ మీకు
మన్నింపుడీ
రచయిత:
మహమ్మద్ హుస్సేన్
Great! U r really lucky to b the heir of a laureate, who won several great hearts.
ReplyDeleteGreat! U r really lucky to b the heir of a laureate, who won several great hearts.
ReplyDelete