తెలుగు గ్రాంధిక కవిగా ప్రసిద్దిగాంచిన శ్రీ మహమ్మద్ హుస్సేన్ గారికి కుమారునిగా జన్మించటం
నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఆయన జీవిత కాలంలో వ్రాసిన తెలుగు
గ్రాంధిక శతకాలలోని,
కొన్ని శతకాలను computerise చేయాలనే నా ఈ చిరుప్రయత్నo నిరాఘాటంగా పూర్తి కావాలని
ఆకాంక్షిస్తూ .....................
కుమారుడు
అక్బర్ అలీ
స్మరణ
నాన్నగారు
ప్రతిపుస్తకంలోను వారి తల్లిదండ్రులను స్మరిస్తూ, వారియెడ తమ ప్రేమను చాటుకునే
వారు.
జననీ!
సాత్విక భావభూషణ ఘ్రుణీ! సాజన్య సౌదామనీ
పెనుక్షామమ్ములు,
గాంచి – పెక్కిడుమలన్ వీక్షించి – సైరించి – నీ
చనుబాల్
సత్త్వ మొసంగి సాకితివి – నా సాహిత్య వై దగ్ధ్య
సం
జనకం
బెన్నో కృతుల్ వెలార్చితి – కృతజ్ఞత్వంబు చెల్లించెదన్
ననుముద్దారగనగ్రపుత్రుడనివిన్నాణంబునన్
బెంచి, పె
ద్దను
గావించి – సుభాశిషంబులిడి -
విద్యాబుద్ధులన్ నేర్వజే
సిన
మాయమ్మ “హుసేను బీబి “ – ఋణమున్ జెల్లింతునేనెట్లు ? చం
ద్రునకర్పించెడు
నూలు పోగనగ గూర్తున్ – నా నమోవాకముల్.
జనకా !
దేశికవృత్తియందు నిను మించంజాలు వారెవ్వరున్
గనరా“రన్నయశమ్ము గాంచితివి , రంగద్వైద్యరంగమ్మునన్
జను“లోహో“యనుకీర్తి
గొంటివి ‘సిలార్ సాహెబ్ ‘ – ప్రసిద్ధాహ్వయ
మ్మున
వేనోళ్ళ పొగడ్త లందితివి , కైమోడ్పుల్
గ్రహింపంగదే !
కుమారుడు
దొరసానిపాడు
మహమ్మద్
హుస్సేన్
కవి పరిచయం
శ్రీ మహమ్మద్ హుస్సేన్
బిరుదులు : మధురకవి
, కవి రత్న
పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో 08, ఆగష్టు 1919 లో శ్రీమతి హుస్సేన్ బీబీ ,
శ్రీ సిలార్ సాహెబ్ దంపతులకు జన్మించారు.
దొరసానిపాడు గ్రామమే ఆయన స్థిర నివాసం.
ఉపాధ్యాయుడుగా పోస్ట్ మాస్టర్ గా ప్రధానోపాధ్యాయులుగా వృ త్తులు నిర్వహించి పదవీ విరమణ పొందారు.
ఆయన భాషలో : పాతికేండ్లు పోస్ట్ మాస్టరై
వాసిగంటి
ముప్పదేళ్ళు దేశి కుడనై మెప్పుగంటి
ఇరువదేండ్లు నైట్ స్కూల్ నిర్వహించియుంటి
బ్రతుకు దొరసానిపాడు లో పండిపోయే
రచనలు
1. భక్తకల్పద్రుమా
శతకం
2. హరిహరనాథా
శతకం
3. సుమాంజలి
4. లేఖా
గుళుచ్చము
5. శ్రీ
మూర్తిరాజ శతకం
6. తెనుగు
బాల శతకం
7. అనుగు
బాల శతకం
8. మిత్రా
శతకం
9. చిన్నారి
చెల్లెలు నవల
10. మణి
దీపిక
11. ఇల్లాలు
(ఆధునిక నారీ సమాలోకనము)
12. అనుమానం
పెనుభూతం నవల
13. స్త్రీ
నైతిక శక్తి చలిస్తే నవల
14. దంపతులు
(వచన కవిత)
15. తాజా
పూలు (వచన కవిత)
16. సమదర్శనం
17. ఆదర్శ
స్త్రీ
18. మణి
మంజూష
సతీ స్మృతి.......................................నాకు తెలియనివి
ఇంకెన్నో
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ విద్యాలయాల్లో సారస్వత సంస్థల్లో
అనేక గౌరవ సత్కారాలు పొందారు.
ఉస్మానియా కళాశాల, కర్నూలు (1980) ,
ఆంధ్ర సాహితీ సమాజం, ఢిల్లీ (1989) ,
ఉర్దూ కళాశాల కాకినాడలో దంపతుల కృతిసమర్పణ సన్మానం(1996),
హేలాపురి సాహిత్యమండలి, ఏలూరు (1991) ,
ఆంధ్ర సారస్వత పరిషత్తు, బందరు (1984) ,
రవీంద్ర కళాశాల, దెందులూరు (1987) ,
నల్లజర్ల పాఠశాల(1972),
ఆంధ్ర ముస్ల్లిం కవి సమ్మేళనం (1982),
ఏలూరులో మంత్రివర్యులు కోటగిరి విద్యాధరరావుగారిచే 27 మే 1995 న
సాహితీపరంగా, ‘కళనీజన’ బహుమతి ప్రదానం .
అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితాగానం చేసి కవిత్వ రసికులను
అలరించారు
ఆయన జరిగిన సన్మానాలలో ఫోటోలు కొన్ని
వీరిసతీమణి పేరు శ్రీమతి ఫాతిమున్నీసా
ఆ ఆదర్శ దంపతుల ఫోటో

ఆయన జరిగిన సన్మానాలలో ఫోటోలు కొన్ని
వీరిసతీమణి పేరు శ్రీమతి ఫాతిమున్నీసా
ఆ ఆదర్శ దంపతుల ఫోటో
నాన్నగారికి నల్గురు సంతానం.
ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు.
1.
S.M. బాజి – (కుమారుడు)
2.
S. నజిమున్నిసా – (కుమార్తె)
3.
S. అక్బర్ అలీ – (కుమారుడు)
4.
S. ముంతాజ్ – (కుమార్తె)







Wow! I'm delighted with wonder to be associated with a great personality belonging to a great poet/writer. Kudos to your efforts n keep continuing...
ReplyDeletethank u boss
DeleteWow! I'm delighted with wonder to be associated with a great personality belonging to a great poet/writer. Kudos to your efforts n keep continuing...
ReplyDeleteGreat effort Chichcha, You are Living your truth. Expressing your love. Sharing your enthusiasm. Taking action towards your dreams. Walking your talk. We are proud that the poet's great work can now be read by the world.
ReplyDeletePS: Do you think you can add few of his photographs or laurels as well?
I mean all these poetries would also have a shape or a photograph for people to realise-who they were reading about.
Thanks for putting Daada on the web.
Daada lives on.
Lots of Love,
Galib Hussain,
GS/o SMD Hussain
certainly
ReplyDelete